- ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: విద్య,వైద్యం,ఉపాధి కల్పనలో రామగుండం నగరo అగ్రగామిగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సప్తగిరి కాలనీలో మహాత్మ జ్యోతి బా పూలే పాటశాల ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవo కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగరంలో స్వచ్చదనం, పచ్చదనంతో పాటు విశాలమైన రహదారులతో సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.ఈ ఏడాది రామగుండం నగరంలో మునిసిపల్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి,ఎన్ టి పి సి సహకారంతో సుమారు పది లక్షల మొక్కలు నాటి అడవిని తలపించేలా పెంచి పోషించాలని లక్ష్యoగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి చంటి బిడ్డల్లాగా సాకాలని అన్నారు. గతంలో చెప్పినట్టుగా సప్తగిరి కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు.పాటశాల ప్రిన్సిపాల్ కోరిన వెoటనే స్థానికులు,విద్యార్థుల సౌకర్యార్థం వారం రోజుల్లోనే రోడ్డు వేయించామని అన్నారు.సప్తగిరి కాలనీలో భవిష్యత్తులో వరద ముప్పు ఉండకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) &కమీషనర్ (ఎఫ్ ఎ సి ) అరుణశ్రీ మాట్లాడుతూ ఈ ఏడాది రామగుండం నగర పాలక సంస్థ తరపున వన మహోత్సవo కార్యక్రమంలో భాగంగా 4,80,700 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో 1,92,000 మొక్కలు ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ప్రజలు కోరిన మొక్కలను ఉచితంగా అందజేస్తామని అన్నారు.అనంతరం కృష్ణా నగర్,ఎన్ టి పి సి లో రూ. 2.00 కోట్ల సి ఎస్ ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎం ఎల్ ఏ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కృష్ణా నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ 2.00 కోట్లతో కృష్ణా నగర్ కు కూడా ఉపయోగ పడే శాలపల్లి రోడ్డు పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత రెండు కోట్లతో కృష్ణా నగర్ లోనే అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.మరో మూడు కోట్లతో కృష్ణా నగర్ లోనే డ్రైనేజి నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నగరానికి అనేక ప్రాజెక్టులు మంజూరు చేయించామని అన్నారు.కోట్లాది రూపాయలతో శాతవాహన యూనివర్సిటీ పి జి కళాశాల భవనాలను,నర్సింగ్, వైద్య కళాశాల భవనాలు నిర్మాణమవుతున్నాయని అన్నారు.యాభయ్ ఐదు వేల కోట్ల అంచనా వ్యయంతో 3×800 మెగా వాట్ల విద్యుత్ కేంద్రంతో పాటు మరో రూ 3500 కోట్ల అంచనా వ్యయంతో మేడిపల్లి లింగాపూర్ ఓ సి పి లో హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ మంజూరయ్యా యని అన్నారు.కొత్తగా సుమారు 70 వేలమందికి స్థానికంగా ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకట స్వామి,నగర పాలక సంస్థ ఎస్ ఇ శివానంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్,డి ఇ షాబాజ్, ఎ ఇ తేజస్విని, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ , మెప్మా టిఎంసి మౌనిక మహాత్మా జ్యోతిబా పూలే పాటశాల ప్రిన్సిపాల్ రజనీ మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, బాల రాజ్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, వెగోళపు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
