ముద్ర,గద్వాల:
ధరూర్ మండలంలోని శ్రీపెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ వంటి ప్రత్యేక పూజలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి దాసంగాలు సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
