Take a fresh look at your lifestyle.

రైల్వే లైన్ పనుల్లో అనాలోచిత నిర్ణయం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

 

మహబూబ్ నగర్ పట్టణం మధ్య లోంచి వెళుతున్న రైల్వే లైన్ పనుల్లో అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల పలువురు ఇళ్ళు కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం రైల్వే లైన్ పనుల్లో ఇళ్ళు కోల్పోతున్న వారిని ఆయన కలిసి మాట్లాడారు.
కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే డబల్ లైన్ ప్రతిపాదనతీసుకువచ్చారన్నారు రైల్వే అధికారులు చేపడుతున్న డబల్ లైన్ పనుల విషయం లో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అధికారులు అనాలోచితం గా నిర్ణయం తీసుకోవడంతో
రెండు వైపుల తొమ్మిది అడుగుల భూమి తీసుకుంటే సమస్య లేదన్నారు.ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువ తీసుకోవడం తో సమస్య వచ్చిందన్నారు. వ్యాపారం చేసుకునే వారికి కూడా అధికారుల చర్యలతో నష్టం కలుగుతుందన్నారు.
పేదల ఇండ్లలోకి వెళ్లకుండా మార్గాలు మూసివేయడం తో వారంతా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.కరెంటు స
స్థంభాలు తొలగిస్తున్నారనీ,దీంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రెండు వైపుల సమానంగా స్థలం తీసుకుం డబల్ లైన్లో రైళ్లు వెళ్లేందుకు సమస్య లేదన్నారు. అధికారులు అనవసరంగా పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
పేదల ఆస్తులు కులగొట్టిన.. ఇబ్బందులు పెట్టిన ఎవరు పట్టించుకోరని అధికారులు అనుకుంటున్నారనీ, అవసరమయితే ఢిల్లీకి వెళ్లి పేదల పక్షాన పోరాటం చేస్తామన్నారు.వారికీ న్యాయ జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
మాజీ మంత్రివెంట మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.