Take a fresh look at your lifestyle.

కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్‌కు ఘనవిజయాలు: బండి రమేష్

– ​జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఘనంగా సన్మానం
​- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి , ఫిబ్రవరి 22:
పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా.. ఆదివారం స్థానిక కమ్యూనిటీ హాల్‌లో అభినందన సభను నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
​అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం శుభపరిణామన్నారు.
​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
​రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో పనిచేసి, మూడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కార్యకర్తల గట్టి పోరాటం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అద్భుత విజయం సాధ్యమైందని కొనియాడారు. ప్రజా క్షేత్రంలో నిరంతరం అందుబాటులో ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.