Take a fresh look at your lifestyle.

గ్రామాల్లో గృహ నిర్మాణా ఇండ్లు రోడ్డేక్కతున్న మెట్లు

  • ఇరుకుగా మారుతున్న రహదారులు.
  • ఇబ్బందులు పడుతున్న వాహనదారులు .
  • చోద్యం చూస్తున్న ఉన్నంత అధికారులు.

గొల్లపల్లి, ముద్ర విలేకరి: గ్రామాల్లో ఎవరూ ఏమీ అనకపోతే రోడ్డు మీద కూడా ఇళ్లు కట్టేలా ఉన్నారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో చాల గ్రామాల్లో రోడ్డు పక్కన కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నవారు. కొంత మంది గజం స్థలం అదనంగా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే అది రోడ్డు అయినా సరే ఆక్రమించి నిర్మాణాలు చెప్పడుతున్నారు. పంచాయితీ కార్యదర్శిలు కార్యలయానికి పరిమితం,అవుతున్నారు. గ్రామాల్లో పర్యవేక్షణ కరువు, రోడ్డు మధ్యన వరకు ర్యాంపులు మెట్లు ఏర్పాటు చేసుకొని తమ ఇంటిని పొడిగించుకొని నిర్మాణాలు చేస్తున్నారు.ఇలా రోడ్డును ఆక్రమించి ర్యాంపులు మెట్లు ఏర్పాటు చేసుకుంటున్న, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాత్రం చూచిచూడన్నట్లు,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు అలాంటి ఇండ్లకు పంచాయతీ కార్యదర్శిలు ఇండ్లను చూడకుండా తమ ఇష్టరాజ్యంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు.రోడ్డు ఇరుకుగా మారుతుండటంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.ఇలాంటి అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజాప్రతినిధులు చూస్తున్నా తమ ఓటు బ్యాంకు కోసం మిన్నకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఏదిఏమైనా రోడ్డు పరిరక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం వలన ఇలాంటి ఆక్రమలు జరుగుతున్నాయని గ్రామాల్లో ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమ నిర్మాణల పై సుమోటోగా తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించాలని గ్రామాల్లో ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.