ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు మరింత మెరుగుపరిచి మంచి గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.గురువారం ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్ ను పరిశీలించారు. కల్వకుర్తి డయాలసిస్ సెంటర్ కు తెలంగాణ రాష్ట్రంలో అపెక్స్ కిడ్నీ కేర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 44 డయాలసిస్ సెంటర్లలో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.ఇదే వర వడిని కొనసాగించి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వైద్య సిబ్బందికి సూచించారు.అనంతరం ఇన్ పేషెంట్ వార్డు పక్కన రోగి సహాయకులు వేచి ఉండడానికి నిర్మించిన షెడ్డును, మొదటి అంతస్తులో నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ హాల్ ను ప్రారంభించినారు.కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.