Take a fresh look at your lifestyle.

జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

  • ఉప్పునుంతల తహసిల్దార్ కే ప్రమీల.

ముద్ర విలేఖరి,అచ్చంపేట : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల తాహసిల్దార్ ప్రమీల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా జూన్ 3 నుంచి 17 వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఉప్పునుంతల మండల తహసిల్దార్ కే ప్రమీల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అధికారులు రెండు టీములుగా ఏర్పడి మండలంలోని 22 గ్రామాల వారిగా ఉదయం 9. గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ ప్రమీలవివరించారు. ఆయా గ్రామ ప్రజలు, రైతులు ఏవైన భూ సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సదుస్సులలో పాల్గొని సాదా బైనామా, పట్టా, సీలింగ్, లావని పట్టా, పోడు భూములు వివిధ భూ సమస్యల పరిష్కారానికి అర్జీ దారుల నుండి ఆధార్ కార్డ్, ఓల్డ్ పాస్ బుక్, కొత్త పాస్ బుక్ జిరాక్స్లను దరఖాస్తుదారుల నుండి స్వీకరించనుంది. రెవెన్యూ సదస్సులో రైతులకు అవగాహన కల్పించేందుకు పలు సలహాలపై రెవెన్యూ సదస్సులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తాసిల్దార్ ప్రమీల తెలిపారు. సదస్సులో దరఖాస్తు ఫారాలు ఉచితంగా దరఖాస్తదారులకు ఇవ్వనున్నట్లు తాహసిల్దార్ తెలిపారు. రెవెన్యూ అధికారులకు దరఖాస్తుదారులు మీ దగ్గర ఉన్న భూముల పత్రాలను జిరాక్స్ రూపంలో అందించాలని కోరారు. ఇట్టి విషయాన్ని మండల ప్రజలు గమనించి, సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నవి.

  • గ్రూప్ 1 లో తహసిల్దార్ ప్రమీల పాల్గొననున్న తేదీల వారిగా గ్రామాలు ఇవి.

పెనిమెళ్ళ : జూన్ 3,లతీపూర్ : జూన్ 4, కొరటికల్ : జూన్ 5, ఉప్పునుంతల : జూన్ 6, వెల్టూరు : జూన్ 9, విగ్నేష్ పూర్ : జూన్ 10, తాడూరు : జూన్ 11, తిప్పాపూర్ : జూన్ 12, అయ్యవారిపల్లి : జూన్ 13, పిరాట్వానిపల్లి : జూన్ 16, రాయిచెడు : జూన్ 17.

  • గ్రూప్ 2 లో డిప్యూటీ తహసిల్దార్ పరశు నాయక్ పాల్గొననున్న తేదీల వారిగా గ్రామాలు ఇవి.

ఉప్పరిపల్లి : జూన్ 3, తిరుమలాపూర్ : జూన్ 4, జప్తి సదగోడు : జూన్ 5, రాజా నగర్ : జూన్ 6, మర్రిపల్లి : జూన్ 9, మామిళ్ళపల్లి, జూన్ 10, మొల్గర : జూన్ 11, పెద్దాపూర్ : జూన్ 12, దాసర్లపల్లి : జూన్ 13, లక్ష్మాపూర్ : జూన్ 16, కంసానిపల్లి : జూన్ 17 వరకు జరుగుతున్నట్లు గ్రామాలలో రైతు వేదికలు ఉన్న స్థలంలో నిర్వహిస్తున్నట్లు, రైతు వేదికలు లేని గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.