- కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ కు ఇచ్చినట్లే అని కవిత మాట్లాడడం విడ్డూరం
ముద్ర విలేఖరి,అచ్చంపేట : తప్పు చేస్తే ఎవరినైనా విచారించడానికి గాని నోటీసులు ఇవ్వడానికి గాని పూర్తి అధికారాలు న్యాయస్థానానికి ప్రభుత్వానికి ఉంటాయని ఉమామహేశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యురాలు శ్రీ శంభు శోభ వెంకటరమణ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నేత శంభు వెంకటరమణ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలను 10 సంవత్సరాలు జలగల పీల్చుకొని తిని పాత స్కూటర్ మీద పయనించే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండే వరకు వచ్చాడు.మరి అధికారం రాకముందు ఆస్తులన్నీ అధికారం వచ్చిన తర్వాత ఉన్న ఆశలేంటి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇక్కడ లిక్కర్ రాణి గా పేరు తెచ్చుకున్న కవిత ప్రాజెక్టు పగుళ్లపై కేసీఆర్ కు నూటికి శిలుస్తే అది తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్లు అని మాట్లాడడం ఆమెకే చెల్లుతుంది కానీ ఇది విన్న ప్రజలు విస్తు పోతున్నారు. 1200 మంది ప్రాణం త్యాగం వల్ల సోనియమ్మ పార్లమెంట్ ని స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సంగతి కల్వకుంట కుటుంబం మర్చిపోయి తామేదో తెలంగాణ సాధించినట్లు చెప్పుకొని వాళ్ళు ఏ అవనీతి పనిచేసిన ఎంత డబ్బు సంపాదించిన అడిగే వాళ్ళు లేరని చెప్పలేని అక్రమాలు చేసి ఫోన్స్ టాపింగ్ కూడా చేసి ఇప్పుడు గురిగింజ మాదిరిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్ చేసిన తప్పుడు పనులకు రాష్ట్రమెందుకు నోటీసులు తీసుకుంటుందని ఎవరు తప్పు చేస్తే వారి వారికి మాత్రమే నోటీసులు అందుతాయని ఏ తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదు కదా అని అన్నారు.ఇకనైనా తెలంగాణ పార్టీ నీళ్ళు నియమాకాలు ఒక్క ఉద్యోగం కూడా ఈయకుండా పరీక్షలన్నీ ముందే లీకేజీ చేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం నికి కేసీఆర్ కు చెల్లుతుందని మర్చిపోతున్న కవిత కి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. నీకు ఇచ్చిన నోటీసులు తెలంగాణ రాష్ట్రానికి వర్తించవు ఎవరు తప్పు చేస్తే వాళ్లకు శిక్ష తప్పదు అది గుర్తుంచుకోవాలని పత్రిక విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో రహీం సత్యనారాయణ, శివాజీ ,హనుమంత్ రెడ్డి, కొండపల్లి వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.