ముద్ర ప్రతినిధి – నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన మరియు వినోద పర్యటనకు వెళ్లినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శృతి తెలిపారు.
ఈ సందర్భంగా నాలుగో, ఐదో, ఆరవ తరగతులకు చెందిన విద్యార్థులు మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియాన్ని కూడా వీక్షించారు.
తర్వాత మయూరి పార్క్‌ను సందర్శించి విద్యార్థులు ఆనందంగా గడిపారు. విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం మరియు వినోదం అందించాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.