Take a fresh look at your lifestyle.

పొంగులేటితో విభేదాలు లేవు

  • మాన్‌హటన్ భూమిని బీఆర్​ఎస్​ నెల్లూరు వ్యక్తికి ధారాదత్తం చేసింది.
  • మక్తల్ ఎమ్మెల్యే వాకిటికి మంత్రి పదవి ఖాయం.
  • మీడియాతో జడ్చర్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రెవెన్యూ మంత్రి పొంగులేటితో తనకు ఎలాంటి విభేదాలు లేవని జడ్చర్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి స్పష్టం చేశారు.రెవెన్యూ శాఖతో మాత్రమే గొడవలు ఉన్నాయని వ్యాఖ్​యానించారు.బుధవారం జడ్చర్లలో ఆయన మీడియాతో మాట్లాడారు.హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని..మరోవైపు వాటిపై చర్యలుండవని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెల్లూరుకు చెందిన వ్యక్తికి కేటాయించిన మాన్‌హటన్ భూమి ప్రభుత్వానిదే అన్నారు, మాన్‌హటన్ భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి వెళ్లానని చెప్పారు.తన ఫిర్యాదు స్వీకరించినట్టు రశీదు ఇవ్వాలని హైడ్రా సిబ్బందిని అడిగితే ఇవ్వలేదని చెప్పారు. రశీదు ఇవ్వకపోతే ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారో..లేదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.ఇదే విషయమై స్వయంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఫోన్‌ చేస్తే ఆయన లిఫ్టు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేగా తన ఫోన్‌నే ఆయన లిఫ్ట్ చేయకుంటే ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటారని మండిపడ్డారు. అలాగే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతోందన్నారు.అందులో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడం ఖాయమని చెప్పారు.ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్​ రెడ్డి ఏడాది క్రితమే నారాయణపేట బహిరంగ సభలో చెప్పారని గుర్తుచేశారు.

Leave A Reply

Your email address will not be published.