Take a fresh look at your lifestyle.

పేద ముస్లింలకు బట్టల పంపిణీ

 

ముద్ర : మల్కాజిగిరి

మల్కాజిగిరి గౌతమ్ నగర్ 182వ డివిజన్ పరిధిలోని ఇంద్ర నెహ్రూ నగర్‌లో పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాల సందర్భంగా ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇంద్ర నెహ్రూ నగర్ మసీదులో పేద ముస్లిం కుటుంబాలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, మాజీ మంత్రి మైనంపల్లి హనుమంతరావు మార్గదర్శకత్వంలో నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, గౌతమ్ నగర్ 182వ డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్ కుమార్, మైనార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి ఫరీద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్, శ్రీకాంత్ యాదవ్, మల్కాజిగిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ మాసం సందర్భంగా పేదలకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తామని వారు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.