- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
- పోసానిపేట, భూషణ్ రావు పేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
- హాజరైన అదనపు కలెక్టర్ బి ఎస్ లత.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం పోసానిపేట, భూషణ్ రావు పేటలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, అదనపు కలెక్టర్ బి ఎస్. లత తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం సిరికొండ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షక పాదయాత్రలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్ద పీట వేస్తు, మహిళా తల్లులను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కొనుగులు కేంద్రాలను వారికి కేటాయించారని వెల్లడించారు.రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరుపున అందిస్తున్నామని తెలిపారు. ఏక కాలంలో రైతు ప్రయోజనాల కోసం 21 వేల కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు అదనంగా 5 వందల రూపాయలను ఇస్తున్నదని తెలిపారు.పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్, అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని, సరిపడా టార్పలిన్ కవర్లు, గన్ని సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు. రైతులు పండించిన పంట చివరి గింజా వరకు కొంటామని పేర్కొన్నారు.
- రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి.
ఏఐసీసీ, పీసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం రోజు దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర ప్రారంభమైందని అన్నారు.మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బీసీ కులగణన చేసి బీసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, అలాగే 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని, ఈ రెండు చారిత్రాత్మక బిల్లులో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాయితీ నాగరాజు,మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, కార్యకర్తలు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
