Take a fresh look at your lifestyle.

బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి* బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్

ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి చూపారని బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్ అన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని ఇచ్చింది. బడ్జెట్లో నిధులు కేటాయింపు లేకుండా ఏ విధంగా నెరవేరుతాయని ప్రశ్నించారు. ఇప్పటికీ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఉద్యోగ, కార్మిక వర్గానికి నిధుల కేటాయింపు జరగలేదన్నారు. ఆశాలు అంగన్ వాడీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు 18 వేల రూపాయల చొప్పున, మధ్యాహ్న భోజన కార్మికులకు వివోఏలకు, ఆర్పిలకు 10 వేల రూపాయలు, మున్సిపల్ కార్మికులకు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు 24 వేల రూపాయలు, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డు, ఆటో కార్మికులకు పదివేల రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.