ముద్ర ప్రతినిధి, మెదక్:
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశపరిచిందని పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ. పాఠశాలను బలోపేతం చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో విద్యకు సరిపోవు కేటాయింపులు కేటాయించకపోవడం విచారకరం అన్నారు. బడ్జెట్లో పెండింగ్ బిల్లులు, పిఆర్సి ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు.
కొఠారి కమిషన్ ప్రకారం ప్రభుత్వ పాఠశాల బాగోగులు, గ్రామీణ ప్రాంతానికి చెందిన చాలా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యాలభ్యసిస్తున్నారు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడాలంటే 15 శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండన్నారు.
రెండేళ్లుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, పెండింగ్ డీఏ బకాయిల గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం చాలా విచారకమన్నారు.