ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన – పట్టణ ప్రగతి 99 రోజుల పాలనలో భాగంగా 22వ వార్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో 6, 22, 23వ 21వార్డులు మరియు 18వ వార్డుకు సంబంధించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వార్డ్ సభను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, స్థానిక మౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే, వార్డ్ స్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.