ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహిస్తున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు.
సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్ గణన ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్‌లో ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలని పేర్కొన్నారు. ఏ ఒక్క కుటుంబం లేదా గృహం గణనలో వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి ఎన్యూమరేటర్ తనకు కేటాయించిన పరిధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. గణనలో నమోదు చేసే వివరాలు భవిష్యత్తు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.అధికారులు సమన్వయంతో పనిచేసి గణన ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు