Take a fresh look at your lifestyle.

పోలీసులు ఎన్నికల నియామావళిని పాటించాలి-జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా పోలీస్ అధికారులతో ఆన్లైన్ ఓరియంటేషన్ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలో మునిసిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడమే పోలీసు యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆన్లైన్ లో నిర్వహించిన ప్రత్యేక ఓరియంటేషన్ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి అధికారి ఎన్నికల నియమావళిని తు.చ. తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్‌కు సంబంధించి అత్యంత సున్నితమైన, సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ అదనపు బలగాలను మోహరించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, గత ఎన్నికల చరిత్ర ఓటర్ల వివరాలను సేకరించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, సస్పెక్ట్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే వెంటనే బైండోవర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే, ఎన్నికల ప్రభావితం చేసే అక్రమ మద్యం రవాణా, నగదు పంపిణీ ఉచితాల పంపిణీని అరికట్టాలని, లైసెన్స్డ్ ఆయుధాలను తక్షణమే డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని, అక్రమ ఆయుధాల విక్రయాలు లేదా వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి భరోసా కల్పించాలని కోరారు. సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, జిల్లా లోని డి‌ఎస్‌పి లు, సి‌ఐ లు, ఆర్‌ఐలు ఎస్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.