ముద్ర, శేరిలింగంపల్లి:
మాదాపూర్ లో ఈరోజు తో చత్తీస్గర్ద్ రాష్ట్రానికి చెందిన హస్తకళ ఉత్సవ్ “గాంధీ శిల్ప బజార్” ముగిసింది. గత పది రోజులనుండి నిర్వహించిన మేళ లో సందర్శకులు హస్తకళాకారులను ప్రోత్సహించారు. ట్రైబల్ కళాకారుల ఉత్పత్తులు బస్తర్ మెటల్ క్రాఫ్ట్, మెటల్ జ్యువలరీ, గృహోపకరణాలు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ మరి అందుబాటులో ఉన్నాయి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ విన్నీల రావు గారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో రామాయణ శబ్దం, ధనశ్రీ తిల్లాన, భో శంభో, జతిస్వరం, రాజా రాజేశ్వరి, బృందావన నిలయే, బ్రహ్మాంజలి, కొలువైతివారంగా సాయి, ఒకపరి కొకపరి, చందాన చర్చిత, ప్రహళ్లాద పట్టాభిషేకం, అతి నిరుపమా, శివ తాండవం అంశాలను గాయత్రీ, రాణీత, అనన్య, హంసిక లక్ష్మి ప్రసన్న, ఆరాధ్య, గీతికా, యోషా, పూర్వీక, అక్షర, వివేకా, శివాని మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. 