ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, వాటిని వైరల్ చేయటానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. ఇటీవల వైరల్‌గా మారిన ఓ ఘటన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పట్టణంలోని ఎంఐఎం వార్డు అభ్యర్థి, నాంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరమైన, అవమానకరమైన, విద్వేషపూరిత పోస్టులు, వీడియోలు లేదా వ్యాఖ్యలను ఫార్వర్డ్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్‌లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.