బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి మరోసారి తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు గణనీయమైన విజయాన్ని సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు.
ఈ పరీక్షల్లో జాదవ్ సిద్దు, పెందుర్ జ్యోతిరామ్,శ్రవణ్, నాగేష్, నర్సింలు,రాజశేఖర్ వంటి విద్యార్థులు గురుకుల విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించారు. వారి విజయంతో పాఠశాలలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.
పాఠశాలలో నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఈ విజయానికి కారణమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గురుకుల ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కోచింగ్ తరగతులు కూడా విద్యార్థుల విజయానికి దోహదపడ్డాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.