ముద్ర, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిమాపక కేంద్రం లేని కారణంగా అగ్ని ప్రమాదాలను నివారించడంలో వైఫల్యం చెందాల్సి వస్తుందని మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం దూళిపాల అన్నారు.ఈ మేరకు అన్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరారు.ఈ సందర్భంగా సీతారాం ధూళిపాల మాట్లాడుతూ,స్థానికంగా ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు లేకపోయేసరికి అగ్ని ప్రమాదాలు తీవ్రంగా ప్రభావాన్ని చెబుతున్నాయని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్థానికంగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.సుమారు రెండు లక్షల పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం బాధాకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మణికొండ బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ధనరాజ్, ముఖ్య కార్యదర్శి గుట్టమీద నరేందర్,సీనియర్ నాయకులు అందే లక్ష్మణరావు, గోరుకంటి విటల్, ఉపేంద్రనాథ్ రెడ్డి,సంఘం శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, యాలాల కిరణ్, కందాడ ప్రవీణ్, సుమనళిని, షేక్ ఆరిఫ్, ఆరిఫ్ మహమ్మద్,సుమన్, యాలాల బెన్నీ, అశ్వక్ అలీ తదితరులు పాల్గొన్నారు.