ముద్ర, బీబీనగర్ :
జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. శనివారం జిల్లా పరిధిలోని బీబీనగర్ మండల కేంద్రంలో నిర్వహించిన జనగణన మొదటి దశ శిక్షణ తరగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 50 మంది ఎనుమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారని తెలిపారు. జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని అధికారులు పేర్కొన్నారు.
ఈ శిక్షణ తరగతులు శనివారం, సోమవారం, మంగళవారం రోజుల్లో కూడా కొనసాగనున్నాయి.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీఓ, యం ఈ ఓ, సంబధిత అధికారులు పాల్గొన్నారు.