Take a fresh look at your lifestyle.

సోషల్ మీడియాపై సైబర్ సెక్యూరిటీ దృష్టి

  • పిల్లలతో అశ్లీల వీడియోల డౌన్ లోడ్, షేర్.
  • 18 మంది యువకులు అరెస్ట్.
  • డీజీ శిఖా గోయల్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : పిల్లలతో అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి వాటిని షేర్ చేస్తోన్న యువకులపై తెలంగాణ పోలీసులు కొరడా ఝుళిపించారు.అమెరికాలోని ఇంటర్నెట్ క్రైమ్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన సమాచారంపై స్పందించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం హైదరాబాద్‌లో 18 మంది యువకులను గురువారం అరెస్ట్ చేసింది.ఈ యువకులు ఇంటర్నెట్ ద్వారా చిన్న పిల్లల అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసి వాటిని మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాలో ఇతరులకు షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆ యువకులు ఒక్కొక్కరిపై కనీసం ఐదు ఫిర్యాదులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల డివైజ్‌లను స్వాధీనం చేసుకొని డేటాను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పిల్లల పట్ల అశ్లీల కంటెంట్‌ షేరింగ్‌పై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, ఈ యువకులు వాటిని తేలిగ్గా తీసుకుని నేరచర్యలకు గురయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిపై పాస్‌కో చట్టం, ఐటీ యాక్ట్ వంటి విభాగాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. క్రైమ్ పోలీస్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో చైల్డ్ పోర్న్ వీడియోలు అప్లోడ్ చేస్తున్న కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ కు చెందిన 15 మందిని అరెస్ట్ చేసినట్టు డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఈ నిందితులకు మరో 34 కేసుల్లో సంబంధం ఉందన్నారు. వీరంతా 19 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని చెప్పారు. కొంతమంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో సోషల్ మీడియాపై సైబర్ సెక్యూరిటీ పూర్తి దృష్టి పెడుతుందన్న శిఖాగోయల్ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.