Take a fresh look at your lifestyle.

పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు అవస్థ-సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జాలిగపు శిరీష

 

* సరఫరా చేయడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలం

* నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే పెట్రోల్ కొరత లేదంటూ అధికారులు చెప్పడం విడ్డూరం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ప్రజలు అవస్థలు పడుతున్నారని దీనికి భిన్నంగా ఎక్కడ కూడా పెట్రోల్ కొరత లేదంటూ చెప్పడం విడ్డూరం అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జాలిగపు శిరీష విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ పెట్రోల్ బంకు ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ కొరత ఏర్పడి పెట్రోలు డీజిల్ స్టాక్ లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ అందుకు తగినట్లు పెట్రోల్ డీజిల్ ధరలను సప్లై చేయకపోవడం అందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడమే ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయన్నారు.కానీ అధికారులు ప్రభుత్వం ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పడం చూస్తుంటే తమ తప్పులు కప్పిపుచ్చుకోవడం తప్ప మరొకటి కాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పెట్రోల్ ను ప్రజలకు సరఫరా చేయాలని కోరారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు మామిడాల కనకయ్య, కొండం సంజు, బత్తుల అభిషేక్ బాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.