Take a fresh look at your lifestyle.

టెండర్ల రద్దుపై కలెక్టర్ కు బీజేపీ ఫిర్యాదు

 

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించి గతంలో మంజూరైన రూ.15 కోట్ల నిధుల పనుల టెండర్లను  నూతనంగా మున్సిపల్ కౌన్సిల్ లో  రద్దు చేస్తామని  నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ నేతలు కలెక్టర్ అభిలాష అభినవ్ కు ఫిర్యాదు చేశారు. ఈ చర్య అభివృద్ధిని అడ్డుకునేలా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ అన్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికే ఇలా చేస్తుందంటూ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వరుసగా రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికలలో, ఎమ్మెల్యే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో భారతీయ జనతా పార్టీ గెలుపొందిన విషయం గుర్తుచేశారు. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 80 స్థానాలు గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం 13 సీట్లు గెలుపొందామని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్నారు.  కాంగ్రెస్ పార్టీనే జిల్లాలో తమ ఉనికి కాపాడుకునేందుకు చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ  అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు శ్రీరామోజు నరేష్, కూన శశాంక్, ముత్యం, ధర్మాజీ గారి ఈశ్వర్, విఠల్, ఖమ్మం సురేందర్ తో పాటు పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.