Take a fresh look at your lifestyle.

జాతీయ మెగా లోక్- అదాలత్లో అపూర్వ స్పందన..

89 కేసుల్లో విజయవంతంగా రాజీ..

712 కేసులల్లో అడ్మిషన్/జరిమాన…

జిల్లా వ్యాప్తం గా 801 కేసులల్లో పరిష్కారం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

జాతీయ మెగా లోక్- అదాలత్లో అపూర్వ స్పందనతో 89 కేసుల్లో విజయవంతంగా రాజీ అయినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తం గా నమోదు కాబడిన ఇ-పెట్టి కేసులలో 1260 కేసులలో గల నిందితులు జరిమానా చెలిచి వారి పైన ఉన్న కేసు లను అడ్మిషన్ చేశామన్నారు. సైబర్ నేర సంబందిత కేసులలో నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ: 36,000 తిరిగి బాధితులకు అందేలా
కోర్ట్ ఆదేశాలు వచ్చిన్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి 89 IPC / BNS కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం, 712 IPC/BNS కేసులల్లో, 1261 – ఇ-పెట్టి, 21- డిడి కేసులలో అడ్మిషన్/ జరిమాన విధించడం జరిగిందన్నారు.
జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజ మార్గం అని, రాజీ పడటం ద్వారా ఇరువర్గాలు సమఉజ్జీలు
ఉంటారని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన జిల్లా పి, పి లను, పోలీస్ అధికారులను, కోర్ట్ లైజనింగ్ అధికారిని, కోర్ట్ డ్యూటీ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.