Take a fresh look at your lifestyle.

హెడ్గే వార్ మన తెలంగాణ వాసియే….

జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బిజెపి నేత రచ్చా శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

హిందూ సమైక్యత కోసం ఆర్ఎస్ఎస్ ను స్థాపించి హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించారు.

మన తెలంగాణ వారసులే…
మహారాష్ట్రలోని నాగపూర్ లో 1889 ఏప్రిల్ 1వ తేదీన ఉగాది రోజు జన్మించిన హెడ్గెవార్ కుటుంబం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామానికి చెందిన వారు కావడం మన తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని ఆయన గుర్తు చేశారు.
విజయదశమి రోజున…
1925లో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన హెడ్గెవార్ అకుంఠిత త్యాగభావకుడని, సమర్థవంతమైన నాయకుడని అన్నారు. హిందూ సమాజాన్ని మేలుకొలిపి జాతీయవాద సిద్ధాంతాలను ఉద్భోదించిన ఆయన స్ఫూర్తితో ముందుకు సాగడమే ఆయనకు నిజమైన జయంతి నివాళి అవుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.