Take a fresh look at your lifestyle.

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతి…

కొండపైన దుకాణాలను టెండర్లు వేస్తే రూ. 20 నుండి 30 కోట్లు ఆదాయం వస్తుంది.
ఈ నెల 31న కొండపైన దుకాణాల కాలపరిమితి ముగింపు..
దేవస్థానానికి గండి కొడుతున్న కొండపైన వర్తక సంఘం. యాదాద్రి పరిరక్షణ కమిటీ.

ముద్ర, యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘం పేరిట దేవస్థానానికి సంవత్సరానికి 10 దుకాణాలకు కేవలం రూ.1 కోటి 68 లక్షల మాత్రమే చెల్లిస్తున్నారు. అదే ఒక సెల్ ఫోన్ కౌంటర్ టెండర్ సంవత్సరానికి రూ. 2 కోట్ల 22 లక్షల పైగా దేవస్థానానికి ఆదాయం సమకూరుతుంది. ఇదేవిధంగా ఇతర టెండర్లలో కోట్లలో ఆదాయం వస్తుంది దేవస్థానంలో ప్రతి టెండర్లు ఒక సంవత్సరం కాల పరిమితితో కొత్తవారికి ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పించి దేవస్థాన ఆదాయాన్ని అభివృద్ధితోపాటు భక్తుల సౌకర్యాలు పెంచే ప్రణాళిక చేయాలి. ఒక్కరే దేవస్థానంలో దుకాణాలను కొనసాగించాలని నియమం లేదు. అందరికీ అవకాశాలు కల్పించే దిశగా టెండర్లు జరగాలి, కొండ కింద అన్నదానం కాంప్లెక్స్ వద్ద వర్తక సంఘం వారికి కేటాయిస్తూ గత ప్రభుత్వం వెసులుబాటుగా నిర్మించిన 112 షాపింగ్ కాంప్లెక్స్ టెండర్లు వేస్తే దేవస్థానానికి ఆదాయం వస్తుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 10 దుకాణాలను రద్దుచేసి అదనంగా 30 కొత్త దుకాణాలు టెండర్లు వేయాలని స్థానికులు వ్యాపారస్తులు నిరుద్యోగులు, బాధితులు కోరుతున్నారు.

ఈనెల 31 నాటికి కొండపైన వర్తక సంఘంలోని దుకాణాలకు గడువు ముగుస్తుంది. కాగా ప్రతి సంవత్సరం దేవస్థానం పరిధిలో టెండర్లకు 3 నెలల టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. కానీ టెండర్ల సమయం దగ్గర పడ్డ ఇంతవరకు టెండర్లు వేయకపోవడం గమనార్ధం. కొండపైన దుకాణాలలో ప్రకటనలు జారీ చేస్తూ పాత, కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా కొండపై ఉన్న దుకాణాలను కూడా టెండర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల దేవస్థానానికి సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. అంతేకాదు కొత్తవారికి అవకాశం దక్కుతుంది. యాదగిరిగుట్టలో దేవస్థానంలో కొండపై ప్రస్తుతం ఉన్న 112 దుకాణాల కుటుంబాలకి పూర్తి వ్యాపార టెండర్ల హక్కులు లేవు కదా !దేవస్థానంలో ఆదాయం పెరిగితే అభివృద్ధి భక్తుల సౌకర్యాలు పెరుగుతాయి. ఎన్నో సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కొండపైన దుకాణాలు కొనసాగుతూ వర్తక సంఘం పేరిట దేవస్థాన ఆదాయాన్ని గండి కొట్టే వారి వల్ల దేవస్థాన అభివృద్ధి సాధ్యమవుతుందా..?? లేక టెండర్ల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వల్ల సాధ్యమవుతుందా ..?? కొండపై ఉన్న షాపులను టెండర్లు వేస్తే వేలాది నిరుద్యోగులకు వ్యాపారస్తులకు ఉపాధి కలుగుతుంది. అంతేకాదు కొండ కింద అన్నదానం కాంప్లెక్స్ వద్ద వర్తక సంగం వారికి కేటాయిస్తూ గత ప్రభుత్వం వెసులుబాటుగా నిర్మించిన 112 షాపింగ్ కాంప్లెక్స్ టెండర్లు వేస్తే దేవస్థానానికి ఆదాయంతో పాటు వేలాది స్థానిక నిరుద్యోగుల కుటుంబాలకు మేలు జరుగుతుంది.
తరతరాలుగా కొనసాగుతున్న వ్యాపార, ఆర్థిక దోపిడిని అరికట్టాలంటే కొత్త వారికి అవకాశాలు కల్పించాలనేది స్థానిక ప్రజలు నిరుద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు ఆరేస్వామి బండ రామస్వామి దండ బోయిన వీరేష్ బండి వాసు కర్రే ప్రవీణ్ బండి అనిల్ కొన్నే సంజీవ గుండ్లపల్లి లింగం కల్వకొలను సతీష్ స్వర్గం నరేష్ సుదగాని శివ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.