Take a fresh look at your lifestyle.

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: శ్రీరామ నవమి సందర్భంగా జిల్లాలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో వేడుకలు నిర్వహించగా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీ రామాలయం, బాన్సువాడ రూరల్ మండలం దేశాయిపేట రామాలయం, కొల్లూరు రామాలయం, తిర్మలాపూర్ రామాలయం,బీర్కూరు మండల కేంద్రంలోని రామాలయం, పోచారం రామాలయాలలో జరిగిన సీతారాముల కళ్యాణంలో సతీమణి పుష్పతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణంలో పోచారం శంభు రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాంధారి మండలం రామలక్ష్మణ్ పల్లిలో శ్రీ సీత రామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక పూజలు నిర్వహించి సీత రాములవారి ఆశీస్సులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సీత రాములవారి ఆశీస్సులు ఎల్లారెడ్డి ఎల్లపుడు ఉండాలని ప్రజలు ఎల్లపుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.