ధర్మపురి:
ధర్మపురి నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఆలయాల ధర్మకర్తల మండలి తరఫున శుక్రవారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ప్రముఖ పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు 9 రోజులపాటు నిర్వహించే నరసింహ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ ఈవో శ్రీనివాస ఆధ్వర్యంలో ఆలయ పూజారులు మంత్రి గారికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో ని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి గారికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే వేడుకలకు హాజరుకావాలని మంత్రి గారిని ఆహ్వానించారు.
ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం మంత్రి గారికి అందజేశారు. ఈనెల 25వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వాన పత్రికను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి అందజేశారు.