ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
తెలంగాణా రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేజీబీవీ, యుఆర్ఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు దశల పోరాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మొదటి దశలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ రోజు అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
జిన్నారం మండల టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షురాలు ఉమాదేవి గారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు అమరేశ్వరి గారు. టీఎస్ యుటిఎఫ్ కేజీబీవీ రాష్ట్ర అధ్యక్షురాలు విశాలాక్షి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉద్యోగుల న్యాయ పరమైన కోరికలను పరిష్కరించ కుండా ప్రభుత్వం తాస్తారం చేయడం సమంజసం కాదని. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని సమ్మె కాలపు వేతనం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో కేజీబీవీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.