ముద్ర, ప్రతినిధి భువనగిరి :
తెల్లవారుజామున చల్లని వాతావరణం ఉన్నప్పటికీ ఉదయం 8 దాటితే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగి 32 డిగ్రీలకు చేరుకుంది. ఎండలకు ప్రజలు తాళలేకపోతున్నారు. ప్రజలు ఇంటికి పరిమితం కావడంతో, వాహనదారులు లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుషముగా మారుతున్నాయి. కూలర్లు, ఫ్రిజ్లు, జ్యూస్ చేసే మిక్సీలు, టోపీలు అమ్మకాలు జోరు అందుకున్నాయి. సుమారుగా 200 కుటుంబాలు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుండి జ్యూస్ అమ్మకాలను నిర్వహించడానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు తరలి వచ్చారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో జ్యూస్ ఫ్రిజ్లను ఏర్పాటు చేసుకొని అమ్మకాలు చేస్తున్నారు. రాజస్థాన్ నుండి చెరుకు రసం అమ్మే యంత్రాలు తీసుకువచ్చి చెరుకు రసం అమ్మకాలు చేస్తున్నారు.
దాహార్తికి ఇబ్బంది పడుతున్న ప్రజలు…
బస్టాండ్ లో, పెట్రోల్ బంకుల వద్ద, వివిధ కుడళ్ల వద్దకి వచ్చిన ప్రజలు తాగు నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వివిధ చౌరస్తాల వద్ద ప్రభుత్వము లేక స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్రిజ్జులు కొనలేని పరిస్థితిలో ఉన్న నిరుపేదలు, సామాజిక స్పృహ ఉన్నవారు తాగునీటి చల్లదనానికై కుండలు కొనుగోలు చేస్తున్నారు. కూలర్లు కామ పిజ్జాలు ఫ్రిజ్లు పెరగడం వాడకం విద్యుత్ వినియోగం పెరిగింది.
ఎండల నుండి జాగ్రత్త పడండి
ఎండల నుండి జాగ్రత్త పడాలని ప్రజలు తమ పనులను ఉదయము సాయంత్రం వేళలో చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున వాటిని తట్టుకోవడానికి టోపీలు, కళ్లద్దాలు, గొడుగులు వాడాలని సూచిస్తున్నారు. సన్ స్క్రీన్ మాశ్చరైజ్ శరీరానికి రాసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్ లో ఉన్న నీటి కంటే కుండలో నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమంగా ఉంటాయని తెలిపారు.
ఒంటిపూట బడులు..
వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నడపాలని నిర్ణయించింది
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.