Take a fresh look at your lifestyle.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్లు సూచన

 

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, జి.వీ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులకు సూచించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్‌తో కలిసి అదనపు కలెక్టర్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

ఈరోజు ప్రజావాణికి మొత్తం 34 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.