- అందరి కృషి ఆశీర్వాదంతో మంత్రి పదవి దక్కింది.
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అందరి కృషి ఆశీర్వాదంతో మంత్రి పదవి దక్కిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చిన అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్మపురి రోడ్డులోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా పట్టణంలోని టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఆడ్లూరీ లక్ష్మణ్ కుమార్ రాజీవ్ గాంధీ విగ్రహానికి, పాత బస్టాండ్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టౌన్ హాల్ లో లక్ష్మణ కుమార్ ను శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనిలో నిజాయితీ గా ఉండాలి..పార్టీ కోసం పనిచేయాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు అని ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని, కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారం తో ముందుకు సాగుతానని, అండగా నిలుస్తామని అన్నారు. ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ, అందరి సమస్యలు పరిష్కరిస్తారని లక్ష్మణ కుమార్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ సమర్ధవంతముగా పని చేశారని, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. గత శాసన సభ ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో లక్ష్మణ కుమార్ ను ఓడించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యత పాటించాలనే సంకల్పంతో కేబినెట్ విస్తరణ చేపట్టారు. సామాజిక న్యాయం పాటించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దశాబ్ద కాలంగా బీ ఆర్ ఎస్ అరాచకాలను ఎదిరించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని, అన్నింటికన్నా పెద్ద పదవి ఆత్మ గౌరవం అని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు, ఆకుల లింగా రెడ్డి, కరం చాంద్,బండ శంకర్, షాకీర్, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కళ్లేపల్లి దుర్గయ్య, రమేష్ రావు,జలపతి రెడ్డి,మసర్తి రమేష్, చాంద్ పాషా, కొయ్యడ మహిపాల్, మ్యకల రమేష్, మన్సూర్, నిశాంత్ రెడ్డి, శైలేంద్ర రెడ్డి నేహాల్, భూక్యా సరళ, గోపి మాధవి,ధర రమేష్ బాబు, గోపి రాజిరెడ్డి, బీరం రాజేష్, నల్లా స్వామి రెడ్డి, బోగ సందీప్ పాల్గొన్నారు.
