Take a fresh look at your lifestyle.

ఘనంగా గాయత్రి యజ్ఞo

  • నూతన తరగతి గదుల భవన ప్రారంభోత్సవం.

కోరుట్ల, ముద్ర విలేకరి:  శ్రీసరస్వతీ శిశు మందిరం కోరుట్ల పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదుల భవనం ప్రారంభోత్సవం బుధవారం రోజు డాక్టర్ వేముల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన శ్రీ లింగం సుధాకర్ రెడ్డి, విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి చేతుల మీదుగా జరిగింది. ఉదయం పాఠశాలలో కార్యక్రమాలను గాయత్రి యజ్ఞo తో ప్రారంభించారు. ప్రధాన వక్త గా వచ్చిన శ్రీ లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు దేశభక్తి మిళితం చేసి విద్యాబోధన జరుగుతుందని ఇలాంటి శిశు మందిరం పాఠశాల లను ఎక్కడ ఉన్నా సమాజంలో అందరూ ఆదరించాలని, వాటి అభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.పూర్వ విద్యార్థి బూరుగు సత్యనారాయణ గౌడ్ తనవంతుగా సామాజిక బాధ్యతగా తను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి గాను భవన నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు, కొత్త సురేష్, వనతడుపుల రవికుమార్, బండారు రాజేశ్వర్, రేగుంట రాజేంద్ర ప్రసాద్ తమ వంతుగా ఒక లక్ష రూపాయలను ఆర్థిక విరాళాలు అందించారు. పాఠశాల దిన దినాభివృద్ధి చెందడంలో ఎంతో మంది పూర్వ విద్యార్థుల కృషి ఉందని వీటిని మరింత అభివృద్ధి చేయాలని, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బొడ్ల శ్రీనివాస్, పూర్వ ప్రధానాచార్యులు బండారి కమలాకర్, పాఠశాల ప్రబంధ కారిణి, సమితి సభ్యులు డాక్టర్ వేముల రవికిరణ్, వడ్లకొండ రాజగంగాధర్, చెట్పల్లి శంకర్, వనపర్తి చంద్ర మోహన్, ఎలిమిల్ల మనోజ్ కుమార్, అందె శివ ప్రసాద్, నీలి శ్రీనివాస్, ముదిగొండ రాజేశం, బీమనాతి రాజ గంగారాం, పిస్క రమేష్, కొండ బత్తిని అమర్ నాథ్, కొత్త సందీప్, తాటికొండ విశాల్, పుర ప్రముఖులు, పూర్వ ఆచార్యులు, విద్యార్థులు, పోషకులు, ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, ఆచార్య బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.