Take a fresh look at your lifestyle.

కలెక్టర్ ను కలిసిన టీఎన్జీవోలు

ముద్ర ప్రతినిధి, మెదక్:*
మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమాసింగ్ ను టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల మొక్కతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేసినప్పుడు సహకరించిన ఉద్యోగులు మునుముందు కూడా అదే విధంగా ఉద్యోగులు సహకరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కలిసిన వారిలో జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ, జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షులు పజాలుద్దీన్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శులు శంకర్, శివాజీ, కిరణ్ కుమార్, రాధా, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు సతీష్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, చంద్రహాస్, సహ అధ్యక్షుడు శ్రీకాంత్, స్వాతి తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.