ముద్ర ప్రతినిధి, మెదక్:
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడని తెలిపారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు.
ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని తెలిపారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, బీసీ సంఘ నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post