ముద్ర , జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ వాహన డ్రైవర్లు మంగళవారం నిరసన చేపట్టారు. గత 8 నెలలుగా తమకు రావాల్సిన బిల్లులు రావడం లేదని, అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించామని, అయినా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు పెండింగ్ లో ఉన్న దృష్ట్యా వాహన సేవలను నిలిపివేస్తున్నట్లు డ్రైవర్లు పేర్కొన్నారు. వెంటనే తమ పెండింగ్ బిల్లులను ఇప్పించాలని కోరారు.
