ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం పొలాస ఫిల్టర్ బెడ్ మరమ్మతుల పనులను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. అంతకు ముందు పొలాస గ్రామంలో శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పొలాస ఫిల్టర్ బెడ్ వినియోగం లోకి తీసుకువచ్చే సమయంలోనే రాష్ట్రం ఏర్పడడం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భగీరథ వాటర్ సప్లై స్కీం ద్వారా రాష్ట్రం అంత నీరు అందించాలని సంకల్పించడం దానితో నిర్మాణం పూర్తి చేసిన సిపీ డబ్ల్యు స్కీంల వినియోగం నిలిపివేశారన్నారు. పొలాస, బీర్పూర్, రాయికల్ ఇవన్నీటిని కూడా ఆపరేషన్ వినియోగాన్ని నిలిపివేసి భగీరథ అని సరఫరా పొందడం దాని ద్వారానే త్రాగునీటి సరఫరా చేయాలని సంకల్పించారన్నారు. రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తదుపరి పార్లమెంట్ ఎన్నికల ముందు సిపీ డబ్ల్యు స్కీంలకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గంలో 3 పొలాస , బీర్పూర్, రాయికల్ స్కీమ్స్ వినియోగం లేక, అవి మళ్లీ రెస్టరేషన్ కావడానికి మరమ్మతులకు నిదులు అవసరమని మరమ్మత్తులతో పాటుగా గతంలో క్లోరినేషన్ కేవలం లిక్విడ్ క్లోరినేషన్ ఉండే దానిని గ్యాస్ క్లోరినేషన్ గా మార్చడం జరిగింది గ్యాస్ క్లోరినేషన్ ద్వారా నీటిని శుద్ధి చేయాలని మరియు మరమ్మతులు అంచనా వేస్తే 3 స్కీమ్స్ కి సంబంధించి అంచనాని తాను సియం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో 14 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. 14 కోట్లలో 5 కోట్ల 30 లక్షల రూపాయలు పొలాస ఫిల్టర్ బెడ్ క్లోరినేషన్ పైపు లైన్ లింక్ పైప్ లైన్, ఇతర మరమ్మతులకు కేటయించడం జరిగిందన్నారు. పూర్తిగా కల్లెడ గ్రామం వరకు నీటి సరఫరా జరిగే విదంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, రూరల్, అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జున్ను రాజేందర్, శ్రీ రాముల గంగాధర్, మాజీ సర్పంచ్ లు చంద రాధకిషన్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
