ముద్ర,గద్వాల:
ఫుడ్ పాయిజన్ అయితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రజలు కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మొదటిరోజు సోమవారం ఫుడ్ సేఫ్టీ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. గద్వాల గాంధీ చౌక్ లోని పాత డిఎంహెచ్వో కార్యాలయం వద్ద అదనపు కలెక్టర్ జెండా ఊపి ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని, ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు వేడిగా వండుకొని భుజించాలన్నారు.
ఆహారాన్ని వండే ముందు చేతులను, పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కృత్రిమ రంగులు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, అవి కిడ్నీలను దెబ్బతీస్తాయని తెలిపారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని, వీరికి సంబంధిత ఇతర శాఖల అధికారులు అవసరమైన సహాయ సహకారాలను అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాజు, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, సీసీ వెంకటేష్, జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.