Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ కు గర్వకారణం: లాంకో హిల్స్‌కు ప్రతిష్టాత్మక ‘హురున్ ఇండియా’ అవార్డు!

ముద్ర, హైదరాబాద్ బిజినెస్ బ్యూరో : భాగ్యనగర రియల్ ఎస్టేట్ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం లిఖించబడింది. భారతదేశ పట్టణ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన లాంకో హిల్స్ టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ప్రతిష్టాత్మకమైన “హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ ఎక్సలెన్స్ అవార్డు” ను కైవసం చేసుకుంది. హైదరాబాద్ రూపురేఖలను మార్చిన మార్గదర్శక ప్రాజెక్టుగా లాంకో హిల్స్‌ను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది.

Lanco Hills, Hurun India Real Estate Excellence Award

– నగరానికి తలమానికం.. మణికొండకు ప్రాణం

ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న మణికొండ-గచ్చిబౌలి ప్రాంతాన్ని నేడు అంతర్జాతీయ ఐటీ, ఆర్థిక కేంద్రంగా మార్చడంలో లాంకో హిల్స్ కీలక పాత్ర పోషించింది. దేశంలో ‘హై-రైజ్ మిక్స్డ్ యూజ్ టౌన్‌షిప్’ అనే భావన సరిగ్గా తెలియని కాలంలోనే అన్ని వసతులు ఒకే చోట ఉండేలా ఈ మెగా ప్రాజెక్ట్‌ను రూపొందించడం విశేషం.

ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు..

ఎత్తైన నివాస గోపురాలు, SEZ హోదాతో కూడిన ఐటీ పార్క్, లగ్జరీ హోటళ్లు , వాణిజ్య కేంద్రాల సమాహారం. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు జంగిల్ కాదని నిరూపిస్తూ ఇక్కడ 25,000కు పైగా చెట్లను నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. ఆఫీసు, ఇల్లు, వినోదం అన్నీ నడక దూరంలోనే ఉండటంతో ట్రాఫిక్ కష్టాలు లేని ఆధునిక జీవనశైలిని ఇది పరిచయం చేసింది.

– రికార్డుల రారాజు

నిర్మాణ రంగంలో లాంకో హిల్స్ సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా సంస్థ సీఈఓ ఎస్. వెంకట రామ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన మైలురాళ్లను గుర్తుచేసుకున్నారు. “2007లో కేవలం మూడు రోజుల్లోనే 1500 గృహాలను విక్రయించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాం. హైదరాబాద్‌లో స్కైస్క్రాపర్ గగనతలాన్ని తాకే భవనాలు సంస్కృతికి మేమే పునాది వేసాం.’’ అని తెలిపారు.

Lanco Hills, Hurun India Real Estate Excellence Award

తొలి అడుగులు ఇక్కడే

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నుండి ఎత్తైన భవనాలకు అనుమతి పొందిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. నగరంలో మొదటి హై-రైజ్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ సాధించిన ఘనత కూడా వీరి సొంతం. సొంతంగా ఇండోర్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ , 900 మిమీ ప్రత్యేక నీటి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. 45 మీటర్ల వెడల్పు గల అత్యాధునిక వైట్ టాప్ రోడ్ల నిర్మాణం చేపట్టారు.

– పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధికి దిక్సూచి

లాంకో హిల్స్ రాకతో పశ్చిమ హైదరాబాద్ ప్రాంతం రియల్ ఎస్టేట్ హబ్‌గా మారింది. ముఖ్యంగా 2020 తర్వాత ఈ ప్రాంతం గ్లోబల్ ఇన్వెస్టర్లను.. ఐటీ దిగ్గజాలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు.. వేలాది మందికి ఉపాధిని, మెరుగైన జీవన ప్రమాణాలను అందించిన ఒక సామాజిక వ్యవస్థ.

వారసత్వం, ఆవిష్కరణ, స్థిరత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న లాంకో హిల్స్, ఈ ‘హురున్ ఇండియా’ అవార్డుతో తన కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. గ్లోబల్ టెక్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్న ప్రయాణంలో లాంకో హిల్స్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Leave A Reply

Your email address will not be published.