Take a fresh look at your lifestyle.

నారాయణ పేట 10 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బిజెపిలో చేరిక

12 కు చేరిన బిజెపి కౌన్సిలర్ల సంఖ్య

ముద్ర, నారాయణపేట: నారాయణపేట 10 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన బి జయశ్రీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు సమక్షంలో బిజెపిలో చేరారు. అయితే 10 వ వార్డు నుంచి జయశ్రీ బిజెపి రెబల్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ వార్డులో 1256 మంది ఓటర్లు ఉండగా 1023 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి అనూష 160 ఓట్లు, బిజెపి అభ్యర్థి సిద్ది విశాలాక్షి 386, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాత 12 ఓట్లు స్వతంత్ర అభ్యర్థి జయశ్రీకి 451 ఓట్లు రాగ విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థి చేరికతో బీజేపీ కౌన్సిలర్ల సంఖ్యాబలం 12 కు చేరింది.

 

Leave A Reply

Your email address will not be published.