- డి.ఎస్.పి పల్లె శ్రీనివాస్ గౌడ్.
అచ్చంపేట ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో మాదకద్రవ్యాలకు విద్యార్థులు బానిసలు కావద్దని నాగర్ కర్నూల్ జిల్లాఎస్పీ వైభవ్ రంగనాథ్ గైక్వాడ్ఆదేశాల మేరకు అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎవరు కూడాడ్రగ్స్ కు బానిసలు కావద్దనీ డ్రగ్స్ మీ బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తాయి అని విద్యార్థులు ఈ డ్రగ్స్ కు బానిసగా మారి దొంగతనాలు చేస్తున్నారని ఎంతటి వారైనా డ్రగ్స్ వాడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వద్దురా వద్దురా డ్రగ్స్ మానివేయరా అని నిదానాలు చేస్తూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన సదస్సు పై విద్యార్థులతో పాత బస్టాండ్ నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులు డ్రగ్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడితే తన జీవితాలు అందాకారంగా మారుతాయి అని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. అదేవిధంగా డ్రగ్స్ ఎవరైనా వాడినట్టు మాదృష్టికి వస్తె ఎంతటి వారైనా వారిపైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు డ్రగ్స్ కు విద్యార్థులు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సిఐ నాగరాజు మరియు ఎస్సై విజయభాస్కర్ మరియు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
