Take a fresh look at your lifestyle.

విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి: జమాత్ ఏ ఇస్లామి అధ్యక్షుడు

బాన్సువాడ, ముద్ర: విద్యాభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని, పవిత్ర ఖురాన్ లో విద్య గురించి అల్లాహ్ మొదట ప్రస్తావించారని జమాత్ ఏ ఇస్లామీ హింద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అహ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడ లోని ఆర్బర్ హైట్స్ స్కూలు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం కొన్ని పాఠాశాలల్లో పాశ్చాత్య సంస్కృతిని అమలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. పిల్లలకు ఇంగ్లీషు మీడియంతో పాటు విలువలతో కూడిన చదువు ఇప్పించాలని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాలన్నారు. ప్రస్తుతం పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారని, ఫోన్ల నుంచి వారిని దూరంగా ఉంచాలని అన్నారు. చదువుతో పాటు ఖురాన్ సూక్తులను నేర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ముఫ్తి సైద్ అక్బర్, మౌలానా రఖీబ్, మౌలానా మహమూద్ అలీ, ఎజాస్ మౌలానా, హఫీజ్ కరీం, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఎజాస్, అలీబిన్ అబ్దుల్లా, ఖాలిక్, అబ్దుల్ వహాబ్, హకీమ్, షహాబ్, కరెస్పాండెంట్ హఫీజ్, ఆతిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.