Take a fresh look at your lifestyle.

డబ్బుల కోసం మెమోలు ఇవ్వని డిగ్రీ కళాశాల మెమోలు ఇప్పించాలని విద్యార్థుల విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, మెదక్:*
30 వేలు చెల్లిస్తేనే డిగ్రీ, ఇంటర్, టెన్త్ మెమోలు ఇస్తామని చేగుంట శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ లో అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…
చేగుంటలో గల శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశ సమయంలో ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ మాత్రమే తీసుకుంటామని, ఎలాంటి ఫీజులు విద్యార్థుల నుండి వసూలు చేయమని చెప్పారు. డిగ్రీ పూర్తయింది. డిగ్రీతో పాటు ఇంటర్, టెన్త్ మెమోలు ఇవ్వాలని కోరగా స్కాలర్ షిప్ మంజూరు కాలేదు. ప్రతి విద్యార్థి 30 వేల రూపాయలు చెల్లించి మెమోలు తీసుకెళ్లాలని సూచించినట్లు విద్యార్థులు అదనపు కలెక్టర్ నగేష్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. 11 మంది విద్యార్థులు కలెక్టరేట్ కు వచ్చారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ రాజగోపాల్ పలుమార్లు విద్యార్థులు వెళ్లి అడగ్గా ఆ కళాశాలకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. డిగ్రీ పూర్తయి సంవత్సరం అవుతుంది. ఉన్నత చదువులు చదువుకోడానికి, ఎక్కడైనా ఇంటర్వ్యూకు వెళితే ఓరిజినల్ సర్టిఫికెట్లు అడుగుతున్నారని, మెమోలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమ ఒరిజినల్ మెమోలు ఇప్పించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.