- వాల్ రైటింగ్ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్.
కోరుట్ల, ముద్ర: కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మంగళవారం రోజు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ గోడపై వాల్ రైటింగ్ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సభకు పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోరుట్లమండల్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, ఫయ్యుం, అన్వర్, మాజీసర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.