ముద్ర ప్రతినిధి,భువనగిరి :
ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యంగా 6 గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో ఆలస్యం జరుగుచున్నదని, దీంతో ప్రజలు హామీల అమలుపై ఆగ్రహంతో ఉన్నారని, స్థానిక సమస్యలపై త్వరలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించ బోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు బద్దం వెంకట్ రెడ్డి, చింటూ, శేఖర్ పాల్గొన్నారు.