రంజాన్ సందేశంతో ఐక్యతకు నాంది… మైనార్టీలకు ఈదుకా తోఫా పంపిణీ చేసిన శాసనసభ్యుడు డాక్టర్ రాజేష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ నియోజకవర్గం మైనార్టీ సోదరులందరికీ మసీదు నందు నందు నిర్వహించిన ఈదుక తోఫా రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మైనార్టీ సోదరులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
అలాగే మైనార్టీ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
రంజాన్ మాసం శాంతి, సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు నిజాం, నజీమా, ఇస్తాక్ అహ్మద్ ఖాన్, ఆసిఫా బేగం ఖాదర్, కూచుకుళ్ల సింధు, ఇతర నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.