Take a fresh look at your lifestyle.

విధి లేని పరిస్థితిలో వీడుతున్న.. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా..

ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ..
జీవన్ రెడ్డి వెంటే ఉంటామని ముక్తకంఠంతో నినదించిన అభిమానులు, కార్యకర్తలు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నానని పేర్కొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగిత్యాల పట్టణంలోని బండారు గార్డెన్ లో అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా పత్రం విడుదల చేసి, కాంగ్రెస్ పార్టీ కండువా తీసేసి, ఆకు పచ్చ కండువా మెడలో కప్పుకున్నారు.

ఈ సందర్భంగా తాము జీవన్ రెడ్డి వెంటే ఉంటామని అభిమానులు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 20 నెలలుగా మానసిక శోభ అనుభవిస్తున్నానని, ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు దశాబ్దాల అనుబంధం వదులుకోవలని ఎవరు కోరుకోరని, విధి లేని పరిస్థితి లో నిర్ణయం తీసుకున్ననన్నారు. నేను ఈ స్థాయికి రావడానికి మిత్రులు, అభిమానులు, నాయకులు కార్యకర్తలు తోడ్పడ్డారన్నారు. 1984 లో కాంగ్రెసు పార్టీ చేరానని, ఎన్నికల్లో గెలవడం, ఓడటం సహజమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితిలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఐక్యత కు నిదర్శనమన్నారు. 1996 శాసన సభ ఉప ఎన్నికల్లో 1 లక్ష ఓట్లు పోలైతే 54 వేల మెజార్టీ తో గెలుపొందినని, ఉప ఎన్నికల్లో 73 శాతం ఓట్లతో గెలుపొందిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కెసిఆర్ పై 2006, 2008 పార్లిమెంట్ ఉప ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీ చేశానని, 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ ఎస్ గెలుపొందితే ఉత్తర తెలంగాణ జలాల్లో ఏకైక శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా వినిపించానని గుర్తు చేశారు. 2018 లో ఎమ్మెల్యేగా ఓడినా, 2019 ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీగా గెలుపొందినని, శాసన మండలి లో ఏకైక సభ్యుడిగా ఒంటరి పోరాటం చేశానని, కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు, ఒకటి సీపీఐ, 7 గురు ఎంఐఎం సపోర్ట్ ఉండగా, మెజారిటీ ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ పది స్థానాల్లో ఫిరాయింపులు ప్రోత్సహించారని ఎద్దేవ చేశారు. దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై దౌర్జన్యం చేసిన వారిని మళ్ళీ పార్టీ లో స్థానం కల్పించి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులను దోచుకన్నారన్నారు. విధి లేని పరిస్థితిలో బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కుల కు భంగం కలుగనివ్వమని కేసి వేణుగోపాల్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారన్నారు. జగిత్యాల మార్కెట్ కమిటీ మారు గంగారెడ్డి, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి నియామకంలో అందరూ ఏకాభిప్రాయం తెలిపారని, సీఏం రేవంత్ రెడ్డి ను కలసి మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రతిపాదనలు అందజేయాగ వేం నరేంద్ర రెడ్డిని అప్పగించగా, ఏమైంది అని అడిగితే నాది ఏముందీ నాది పోస్ట్ మాన్ ఉద్యోగం సిఎం ఏది చెప్తే ఆది చేస్తా అన్నారని, సీఏం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల కోసం రెండో ప్రతిపాదన చేశారన్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నది బజారులో చంపబడితే కనీసం సి ఎం రేవంత్ రెడ్డి ఏం జరిగింది అని కూడా అడుగలేదని, నా స్థాయి ముఖ్యమంత్రి ఓదార్పు కోరునుకే స్థాయి కాదా అని నిలదీశారు.

ఎమ్మెల్యే సంజయ్ పై ఆగ్రహం…

ఒకవైపు స్పీకర్ పరిధి లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే ఫిరాయింపు విచారణలో ఉండగా, గాంధీ భవన్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహ రచన సమావేశంలో ఎమ్మెల్యే సమావేశం కావడం దేనికి సంకేతం అని అన్నారు. బీ ఆర్ ఎస్ పాలనలో అరచకం చేసిన పోలీస్ యంత్రాంగం మళ్ళీ తీసుకువచ్చారన్నారు. అభివృద్ధి కోసం సీఎం తో కల్సి పనిచేస్తే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, పీ సి సి అధ్యక్షుడు మహిష్ కుమార్ గౌడ్ కల్సి ప్రయాణం చేద్దాం అంటారని, 20 నెలలుగా నన్ను కించపరుస్తూ.. అడుక్కునే స్థాయికి తీసుకువస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. మొన్నటి వరకు ప్రభుత్వం మాత్రమే ఎమ్మెల్యేకు అండగా ఉంది అనుకున్న. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా జతగా మారిందని, పదవులు ఇచ్చే శక్తి లేకున్న కానీ ఆత్మ గౌరవం కాపాడాల వద్దా, మీనాక్షి నటరాజన్ 80 శాతం మీకే ప్రాధాన్యత ఉంటుందని హమీ ఇచ్చారని గుర్తు చేశారు.

జీవన్ రెడ్డిను అనగదోక్కాలనే…

ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఎదగకుండా అణగదొక్కాలని రేవంత్ రెడ్డి ఆలోచనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాది..అడ్డు వేస్తే తొక్కుత అంటున్నారు. ఎంత మంది తొక్కుతారు అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీఏం రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గంలో ఓడిపోయిందని, ఈ వయసులో నాకు బయటకు వెళ్లలని లేదన్నారు.
శాసన మండలి లో ఒంటరి పోరాటం చేసిన నేను మంత్రి పదవికి అర్హుడిని కాదా, సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని పి సీ సి అధ్యక్షుడిగా నన్ను సోనియా గాంధీ నిర్ణయించుకున్న తర్వాత మారుతుందా అని, పెట్టుబడి దారులు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఉన్నాయని వాయిదా వేశారన్నారు. పీ సీ సి అధ్యక్ష స్థాయి వ్యక్తిని నియోజక వర్గంలో నా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును, కెసిఆర్ ను ఎదిరించి పోరాటం చేశానని, రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తానన్నారు. దేవుడు అవకాశం ఇస్తే జగిత్యాలను జాతీయ స్థాయిలో గుర్తు వచ్చేలా అభివృద్ధి చేస్తానని, రెండేళ్లు అవమానాలతో గడిచిపోయిందని, మిగిలిన రెండేళ్లు పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. నేను ముఖ్యమంత్రిని కావలని కోరుకోలేదని, మీ తొక్కుడు భరించలేక స్వేచ్ఛ కోరుకుంటున్న, మమ్మల్ని బతుకన్నివ్వండని, ఇకనైనా కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల రక్షిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మండల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Leave A Reply

Your email address will not be published.