Take a fresh look at your lifestyle.

సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరించండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 

మహాదేవపూర్, ముద్ర:

భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, పొజిషన్ ను సక్రమంగా పరిశీలించి నివేదికలను అందచేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ మరియు అటవీ శాఖలకు సంబంధించిన భూ వివాదాల విషయంలో సంయుక్త సర్వేలు నిర్వహించడం ద్వారా హద్దులను నిర్ణయించాలని కలెక్టర్ స్పష్టంచేశారు. భూ సరిహద్దుల విషయంలో తలెత్తుతున్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు పనిచేయాలని సూచించారు. భూ సమస్యల పరిష్కార ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, భూపాలపల్లి, ఘాన్పూర్, గోరి కొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ల పల్లి మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.